నంద్యాల ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి – సీఐటీయూ.

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు నంద్యాల వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వి, బాల వెంకట్ ఏపీ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకులు ప్రసాద్ లు డిమాండ్ చేశారు. శనివారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు నంద్యాల వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్నటువంటి ఇన్చార్జి సూపర్డెంట్ కు శానిటేషన్ కార్మికులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కార్మికులకు నెలనెలా వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.మూడు నెలల నుండి జీతాలు ఇవ్వకుంటే ఏ రకంగా ఇల్లు గడవాలో అధికారులే చెప్పాలని,ఏరకంగా డ్యూటీలు చేయాలో అధికారులు చెప్పాలని వారు అన్నారు.గత మూడు నెలలుగా వేతనాలు లేకపోవడం వల్ల శానిటేషన్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇంటి అద్దెలు కట్టలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక పూట గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీసం డ్యూటీలకు రావాలంటే ఆటో చార్జీలు కూడా లేనటువంటి పరిస్థితి కార్మికులు ఎదుర్కొంటున్నారని అన్నారు.అధికారులకు కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రతిసారి ఐదు నెలలు నుండి మూడు నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయని, ఇది పునరావతం కాకుండా చూడాలని అన్నారు. అలాగే ఇప్పటినుండి అయినా ఏ నెలకి ఆ నెల వేతనాలు పడేలాగా చూడాలని అలాగే వారికి ఈఎస్ఐ పిఎఫ్ ఏ నెలకానెల స్లిప్పులు ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి సూపర్డెంట్ డాక్టర్ ఆనందరావు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆనందరావు మాట్లాడుతూ మీ వేతనాలు వెంటనే విడుదల చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గురు స్వామి, చెన్నయ్య, మద్దిలేటి, శివకుమార్, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, కుమారి, రాజు లతోపాటు శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు.

  • Related Posts

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఇది నిజం టీవీ న్యూస్ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామం లో అనారోగ్యం తో బాధపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చందల శ్రీను ను వారి నివాసనికి వెళ్లి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నందిగామ మాజీ…

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఇది నిజం టీవీ న్యూస్చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామం మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి మంచినీటి కార్యక్రమం గత నాలుగు నెలలు క్రితం ఇంటింటికి కులాయి కనెక్షన్ అయినది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు<br> గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు<br> పట్టించుకోని అధికారులు

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం