

నందికొట్కూర్ పట్టణానికి చెందిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి పై దాడి చేసి ,గాయపరిచిన వ్యక్తులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం ఈ సంఘటనపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ రఘు రాముడు యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు డబ్బి వెంకటస్వామి గౌడ్ , గౌరవ అధ్యక్షుడు రామకృష్ణ , ప్రధాన కార్యదర్శి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమము కోసం పాటుపడుతున్న కురుమూర్తి పై వ్యక్తిగత కారణాలతో దాడి చేయడం హేయమైన చర్య అని , కూర్చొని మాట్లాడుకోవడం లేదా చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప దాడికి పాల్పడడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వీరన్న , బీసీ నాయకులు డాక్టర్ వెంకటేశ్వర్లు, గోగుల తిమ్మయ్య , పెద్దన్న, లక్ష్మణ్ సింగ్ , డీలర్ రమణ,పెద్ద నాగన్న,పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.