విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. ఓ పెట్టుబడిః రేవంత్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లతోపాటు సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్‌ మెనూ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రంగారెడ్డి జిల్లా చిలుకూరులో స్కూళ్లు, హాస్టల్స్‌లో కామన్ డైట్ ప్రారంభించిన తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్‌లో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని, సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్థుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలిసారి సర్వేల్‌లో సంక్షేమ పాఠశాలను ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. సర్వేల్‌లో చదివిన అనేక మంది కీలక పదవులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం 8 ఏళ్లుగా డైట్ ఛార్జీలు పెంచలేదన్న సీఎం రేవంత్, డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్నారు. కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచి విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఎక్కువ ఫీజులు ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌లో ఎక్కువ మంది చదువుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించాలి. విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. ఓ పెట్టుబడి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే సంక్షేమ హాస్టల్స్‌పై ఫోకస్‌ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తనిఖీల పేరుతో ఇవాళ హాస్టల్స్‌ బాటపట్టింది. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా హాస్టల్స్‌, గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి.. వాళ్లతో కలిసి భోజనాలు చేశారు. రంగారెడ్డి జిల్లా చిల్కూర్‌లో సోషల్​ వెల్ఫేర్ ​రెసిడెన్షియల్ ​స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. అక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్‌ ప్రారంభించారు. అనంతరం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.ఇక నుంచి ప్రతినెల 10న గురుకులాలు,హాస్టల్స్ బకాయిల చెల్లింపు జరుపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రీన్‌ఛానల్ ద్వారా నేరుగా అకౌంట్లలో జమ చేస్తామన్నారు. ఇకపై ప్రతినెలా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు గురుకులాలు, హాస్టల్స్‌ను విధిగా పరిశీలిస్తారని సీఎం స్పష్టం చేశారు. గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్‌కు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, విద్యార్థుల్లో స్కిల్స్ కోసం టాటాగ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందులో భాగంగానే 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఐటీఐలో చేరితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా బోనకల్‌లో బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని గిరిజన వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలో పిల్లలతో కలిసి భోజనం చేశారు మంత్రి సీతక్క. అనంతరం, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనాల్లో క్వాలిటీ తగ్గితే సహించేది లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను సర్వీస్‌ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.



  • Related Posts

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..నిన్న రాత్రి మియాపూర్ జనప్రీయ నగర్ ఈ సంఘటన జరిగింది..మహేష్ భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చేప్పిన వైద్యులు.. శ్రీదేవి అమ్మ మెడపై…

    సోషల్‌ మీడియాలో ఇంటి చిరునామా పెట్టొద్దు..

    వ్యూస్‌ కోసం హోం టూర్స్‌ వద్దు- ఊరెళ్తున్నామంటూ పోస్ట్‌లు పెట్టొద్దు తెలంగాణ పోలీసుల సూచన హైదరాబాద్‌: సోషల్‌ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగాళ్లు దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలచుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాలా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు<br> గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు<br> పట్టించుకోని అధికారులు

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం