ఓపెన్‌ ఏఐ మాజీ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. ఆరోపణలు చేసిన 3 నెలలకే విగతజీవిగా! ఇంతకీ హత్యా? ఆత్మహత్యా?

చాట్ జీపీటీ సురక్షితం కాదని ఆరోపణలు చేసిన 3 నెలలకే ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో అతడిది హత్యా.. ఆత్మహత్యా? అనే చర్ఛ ముమ్మరంగా సాగుతుంది. అసలేం జరిగిందంటే..

చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్‌ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భారత సంతతికి చెందిన అతడు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని బుకానన్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించారు. బాలాజీ సూసైడ్ చేసుకున్నట్లు మెడిక‌ల్ ఆఫీస‌ర్ తెలిపారు. అతని మ‌ర‌ణం వెనుక ఎటువంటి ఆధారాలు లేవ‌ని ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు సైతం ఇది ఆత్మహత్యగా తేల్చారు. నిజానికి బాలాజీ నవంబర్‌ 26న మరణించగా.. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భారత సంతతికి చెందిన బాలాజీ OpenAIలో సైంటిస్టుగా పని చేశారు. బాలాజీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం నవంబర్ 2020 నుంచి ఆగస్టు 2024 వరకు OpenAIలో పనిచేశారు. ఓపెన్‌ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్‌ ద్వారా బాలాజీ వెల్లడించారు. ఆ కంపెనీ పలు కాపీరైట్ల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ విషయమై OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్‌తో వైరం నెలకొంది. ఈ ఆరోపణలు చేసిన 3 నెలల తర్వాత బాలాజీ మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.

  • Related Posts

    ఇలాంటి బావమరిది దొరకడం అదృష్టం: చంద్రబాబు.

    నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 50 ఏళ్లుగా ఎవర్రీన్ హీరోగా రాణిస్తున్నారు. ఆయనలో గొప్ప మానవతావాది ఉన్నారు. ముచ్చటగా మూడోసారి…

    దేశంలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ కేసులు.

    భారత్‌లో ఒక్కరోజే మూడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదుబెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV పాజిటివ్‌అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి HMPV పాజిటివ్‌కరోనా వైరస్ కంటే ప్రమాదమంటున్న వైద్యులు

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ గా నియమితులైన కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు) ను అభినందించిన…

    కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ గా నియమితులైన కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు) ను అభినందించిన…

    నూతన శివాలయానికి భూమి పూజ.

    నూతన శివాలయానికి భూమి పూజ.

    నందిగామమండలం కంచేల గ్రామంలో కల్లాల్లో అరబోసిన ధాన్యాని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడిన నందిగామ రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీ కే బాలకృష్ణ

    నందిగామమండలం కంచేల గ్రామంలో కల్లాల్లో అరబోసిన ధాన్యాని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడిన నందిగామ రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీ కే బాలకృష్ణ

    చందర్లపాడు మండలం. వెలది కొత్తపాలెం గ్రామం

    చందర్లపాడు మండలం. వెలది కొత్తపాలెం గ్రామం

    బీదలకు ఆకలి తీర్చడమే భాను సంస్థ లక్ష్యం :లయన్ దనాల రవికాంత్ బాబు

    బీదలకు ఆకలి తీర్చడమే భాను సంస్థ లక్ష్యం :లయన్ దనాల రవికాంత్ బాబు

    నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు

    నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు