పుష్ప 3లో విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న ఏమన్నదంటే

పుష్ప 2 థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఆరు రోజుల్లోనే 1000కోట్లు వసూల్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1067 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.అల్లు అర్జు నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం 5వ తేదీన థియేటర్లలో విడుదలై దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. కేవలం ఆరురోజుల్లోనే రూ. 1000కోట్లు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప2. ఇక ఇప్పుడు 9 రోజుల తర్వాత ఈ సినిమా కలెక్షన్ స్టేటస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.  పుష్ప 1 కు సీక్వెల్ గా వచ్చిన పుష్ప2 సంచలన విజయం సాధించింది. పుష్ప: ది రైజ్ అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్, సునీల్ నటించారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన చిత్రం. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక పుష్ప 2 సినిమా తొలి రోజే భారీ ఓపినింగ్స్ ను సొంతం చేసుకుంది. మొదటి భాగం కంటే పుష్ప 2లో యాక్షన్స్ సీన్స్ భారీగా ఉండేలా ప్లాన్ చేశాడు దర్శకుడు సుకుమార్.

మొదటి భాగంలో కూలీగా కనిపించిన అల్లు అర్జున్ రెండో భాగంలో పెద్ద స్మగ్లింగ్ కింగ్‌పిన్‌గా కనిపించాడు. సినిమా థియేటర్లలో అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కింది. దాదాపు 3 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తుంది. ఇదిలా ఉంటే పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు. సుకుమార్ కూడా పుష్ప 3 పై క్రేజీ కామెంట్స్ చేశారు.

అయితే పుష్ప 3లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో సుకుమార్ , విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇంతవరకు దాని గురించి ఊసే లేదు. అయితే ఇప్పుడు పుష్ప 3లో విజయ్ నటిస్తున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. మీకే కాదు నాకు కూడా ఆ విషయం గురించి తెలియదు. దర్శకుడు సుకుమార్ చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి విషయంలో సస్పెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. చివరి వరకు ఏ విషయాన్నీ బయట పెట్టారు. ‘పుష్ప 2’కు విషయాలు కూడా సెట్ లో  చెప్పేవారు. సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి.. ‘ఇతనెవరు?’ అని నేనూ ఆశ్చర్యపోయా అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న.

  • Related Posts

    రష్మికలా మారిన యాంకర్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

    ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ స్రవంతి. నిత్యం నెట్టింట్లో తన ఫొటోలను షేర్ చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మొన్న అఘోరి గెటప్ లో కనిపించి సందడి చేసిన ఈ అమ్మడు తాజాగా…

    జాన్వీ కపూర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్…..

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా ఈ చిత్రం షేక్ చేసింది. ఈ సినిమాలో శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ ఐటెం సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు<br> గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు<br> పట్టించుకోని అధికారులు

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం